IPL 2026: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మాజీల విస్మయం.. లైవ్ షోలో సెహ్వాగ్ ‘రెడ్ బుల్’ జోక్.. వైరల్ అవుతున్న వీడియో! | క్రీడా వార్తలు | ACTPnews

హార్దిక్, సెహ్వాగ్


Last Updated:

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ స్కోరును కాపాడుకోవడంలో ముంబై విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ తీసుకున్న ఒక నిర్ణయం మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, వీరేంద్ర సెహ్వాగ్‌లను సైతం ఆశ్చర్యపరిచింది.

హార్దిక్, సెహ్వాగ్
హార్దిక్, సెహ్వాగ్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ స్కోరును కాపాడుకోవడంలో ముంబై విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్ తీసుకున్న ఒక నిర్ణయం మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, వీరేంద్ర సెహ్వాగ్‌లను సైతం ఆశ్చర్యపరిచింది.

శార్దూల్ ఠాకూర్‌ను మర్చిపోయారా?

ఈ మ్యాచ్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం అందరినీ విస్తుపరిచింది. ఈ అంశంపై క్రిక్‌బజ్ షోలో విశ్లేషణ చేస్తూ మురళీ కార్తీక్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. బహుశా అతన్ని ఒక ఆప్షన్‌గా తీసుకుని ఆ తర్వాత మర్చిపోయారేమో! నన్ను అడగకండి.. నా ముఖం చూస్తేనే తెలుస్తుంది నాకు ఏమీ అర్థం కావడం లేదని” అంటూ కార్తీక్ వ్యాఖ్యానించారు.

మురళీ కార్తీక్ గందరగోళంలో ఉండటాన్ని గమనించిన వీరేంద్ర సెహ్వాగ్, తనదైన శైలిలో ఒక జోక్ పేల్చారు. పక్కనే ఉన్న హోస్ట్‌తో మాట్లాడుతూ, “నాకు ఆ రెడ్ బుల్ క్యాన్ ఇవ్వు.. నేను దాన్ని కార్తీక్ ముఖం మీద స్ప్రే చేసినప్పుడు అతను ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతాడు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో షోలో ఒక్కసారిగా నవ్వులు పూసినప్పటికీ, హార్దిక్ పాండ్యా నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ మాత్రం ఎవరికీ అంతుచిక్కలేదు.

ప్రశ్నలకు సమాధానం హార్దిక్ దగ్గరే

శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీయగల బౌలర్ అని, గత మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడని కార్తీక్ గుర్తు చేశారు. కానీ, బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నప్పటికీ హార్దిక్ అతన్ని ఎందుకు వాడలేదు అనే ప్రశ్నకు సెహ్వాగ్ స్పందిస్తూ, “ఈ ప్రశ్నకు సమాధానం కేవలం హార్దిక్ పాండ్యా దగ్గర మాత్రమే ఉంది” అని ముగించారు.

క్లిష్ట స్థితిలో ముంబై ఇండియన్స్

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచిన ముంబైకి, ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ గెలవడం అనివార్యంగా మారింది. బౌలింగ్ విభాగంలో ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్‌లో 54 పరుగులు ఇచ్చి విఫలమవ్వడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీ వ్యూహాలను మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం సెహ్వాగ్, కార్తీక్ మధ్య జరిగిన ఈ ‘రెడ్ బుల్’ చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *