Iran service fees: ప్రపంచ దేశాలకు షాక్.. నౌకలపై ఇరాన్ సర్వీస్ ఫీజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? | | ACTPnews

Iran service fees: ప్రపంచ దేశాలకు షాక్.. నౌకలపై ఇరాన్ సర్వీస్ ఫీజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? |


ఇది సాధారణ టోల్ ఫీజా లేక వేరేదా అనే సందేహం ప్రపంచ వాణిజ్య వర్గాల్లో నెలకొంది. ప్రముఖ వార్తా సంస్థ ANI న్యూస్ రిపోర్టు ప్రకారం, ఇది కేవలం హైవేలపై వసూలు చేసే టోల్ ఫీజు లాంటిది కాదు, సముద్ర మార్గంలో ఇరాన్ అందించే విస్తృతమైన సేవలకు, వసూలు చేసే “సర్వీస్ ఫీజు”. నావిగేషన్ సహాయం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతాపరమైన ఎస్కార్ట్, లాజిస్టిక్స్, బీమా రక్షణ, కొన్ని ప్రత్యేక షరతులతో కూడిన ఇంధన సరఫరా వంటి సేవలను అందించినందుకు ఈ ఫీజును వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అనగా సముద్ర మార్గంలో నౌకలకు సురక్షితమైన, ఎలాంటి ఆటంకాలు లేని ప్రయాణాన్ని కల్పించేందుకు అయ్యే ఖర్చులను ఈ సర్వీస్ ఫీజు కింద ఇరాన్ ప్రభుత్వం రాబడుతోంది. అమెరికా తమపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నందున, ఇరాన్ తన సముద్ర భద్రతా సేవలకు ఈ రూపంలో మూల్యాన్ని వసూలు చేసే వ్యూహాన్ని ఎంచుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports