Last Updated:
Iran US War: ఇరాన్, అమెరికా గొడవ తీరిపోయి.. ప్రశాంతంత రావాలి అని ప్రపంచం కోరుకుంటోంటే.. ఈ దేశాలు మాత్రం భారీ యుద్ధానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలేం జరుగుతోందో తెలుసుకుందాం.
మిడిల్ ఈస్ట్ మళ్లీ మండుతోంది. ఇరాన్ తన సైనిక దళాల ద్వారా ‘జీరో అవర్’ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా నౌకాదళ యూనిట్లపై చర్య తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతోందని హెచ్చరించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై విస్తృత దాడుల కోసం ఇజ్రాయెల్‌కు డజన్ల కొద్దీ అదనపు ఎయిర్ రీఫ్యూయలింగ్ విమానాల్ని పంపాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే అవకాశాల్ని సూచిస్తున్నాయి.
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ కమాండ్ ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికా సైనిక పరికరాలు, సామగ్రి తమ నౌకాదళ యూనిట్ల పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పింది. ఇరాన్ సాయుధ దళాలు ‘జీరో అవర్’ వైపు ముందుకు వెళ్తున్నారని తెలిపింది. “వేచి చూడండి” అని ప్రకటనను ముగించింది. ఈ ప్రకటన ఇరాన్ స్టేట్ టీవీ ద్వారా ప్రసారమైంది. అంటే.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) నౌకాదళ యూనిట్లపై ఇరాన్ దాడికి రెడీ అవ్వబోతోందనే సంకేతం కనిపిస్తోంది.
అమెరికా కూడా.. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్, రామోన్ ఎయిర్‌పోర్టులకు డజన్ల కొద్దీ అదనపు KC-135, KC-46 రీఫ్యూయలింగ్ విమానాల్ని పంపాలని అనుకుంటోంది. ఈ విమానాల వల్ల ఫైటర్ జెట్లు, బాంబర్లూ.. ఎక్కువ సమయం గాలిలో ఉండగలవు. వాటికి గాలిలోనే ఫ్యూయల్ నింపుకునే వీలు కలుగుతుంది. అందువల్ల అవి.. ఇరాన్‌లోని ఎక్కువ ప్రాంతాల్లో దాడులు చేయడానికి వీలవుతుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అభ్యర్థనపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నెతన్యాహూ ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. ఆయనకు యుద్ధం జరగడమే ఇష్టం. యుద్ధం జరిగితేనే.. ఆయన పదవి కొనసాగగలదు.
ఇక అమెరికా.. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ లక్ష్యాలపై ఏడో రోజు దాడులు చేసింది. బందర్ అబ్బాస్ సమీపంలోని 7 వంతెనల్ని ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడుల వల్ల ఇక ఇరాన్.. జలసంధి వైపు తమ సైనిక సామగ్రిని తరలించలేదు అని వారు చెప్పారు. ఇరాన్ వైపు నుంచి జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, కువైట్లలో అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు జరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ చెప్పింది.
ఈ ఉద్రిక్తతలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలకం. ఇరాన్ దాడులు, అమెరికా బ్లాకేడ్ వల్ల చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై నేరుగా దాడి చేయకుండా ఉంటున్నా.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేస్తే బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
ఈ పరిణామాలు 2026 ఇరాన్ యుద్ధం భాగంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోయిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలను కోరుతోంది కానీ ప్రస్తుతం.. యుద్ధం విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన సరిహద్దులను బలోపేతం చేస్తూ, అమెరికా కదలికలను పర్యవేక్షిస్తోంది. అమెరికా తన సైనిక సన్నాహాలను మరింత పెంచుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 18, 2026 12:21 PM IST














