Kajal Aggarwal: బికినీలు వద్దు సరే, మరి ఈ ఘాటు రొమాన్స్ సంగతేంటి? కాజల్‌పై దుమ్ముదుమారం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వివాహం, పిల్లల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్.. తాజాగా బికినీలు వేయడంపై రియాక్ట్ అయి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది.

News18
News18

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గత రెండు దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేశారు. తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. వివాహం, పిల్లల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్న కాజల్, తాజా ఇంటర్వ్యూలో సినిమాల్లో తన హద్దుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

వ్యక్తిగత పరిమితులు దాటలేను.. గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ, మితిమీరిన స్కిన్ షోకి కాజల్ ఎప్పుడూ కాస్త దూరంగానే ఉంటారు. ఇదే విషయంపై ఆమెను ప్రశ్నించగా.. “నాకు బికినీ సీన్స్‌లో నటించడం అస్సలు కంఫర్టబుల్‌గా అనిపించదు. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. వెండితెరపై అలాంటి ప్రదర్శనలు నాకు నచ్చవు. అలాగే మితిమీరిన ఇంటిమేట్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా నేను ఇష్టపడను. నాకంటూ కొన్ని పరిమితులు గీసుకున్నాను. ఆ హద్దులను ఎప్పటికీ దాటకూడదని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో ఆ లైన్ క్రాస్ చేయాల్సి వస్తే.. నిర్మొహమాటంగా ‘సారీ, నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను’ అని చెప్పేస్తాను. పాత్ర ఎంత ముఖ్యమైనా, సినిమా ఎంత పెద్దదైనా సరే నా పరిమితులను ఉల్లంఘించను. జీవితంలో ఎక్కడో ఒకచోట మన పరిమితులు ఏంటో మనం స్పష్టంగా గిరిగీసుకోవాలి” అని కాజల్ స్పష్టం చేశారు.

గతం గుర్తుచేస్తూ నెటిజన్ల ట్రోలింగ్.. కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే, మరికొందరు ఆమె గత సినిమాలను తెరపైకి తెస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో నవదీప్‌తో ‘చందమామ’, అల్లు అర్జున్‌తో ‘ఆర్య 2’, మహేష్ బాబుతో ‘బిజినెస్ మ్యాన్’, రణదీప్ హుడాతో బాలీవుడ్ మూవీ ‘దో లఫ్జోన్ కి కహానీ’ వంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ చేశారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో కాస్త ఘాటు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన విషయాన్ని, గతంలో వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫొటోలు పోస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం కాజల్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే..

NBK111: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్యతో కాజల్ జతకడుతున్న రెండో సినిమా ఇది.

రామాయణ (పార్ట్ 1): బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కాజల్ ‘మండోదరి’ పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ వంటి స్టార్లు నటిస్తున్న ఈ ఇతిహాస చిత్రం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed