Last Updated:
బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ల బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు ఆమిర్ ఖాన్ పై గురి పెట్టినట్లు తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ల బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు మరో హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్పై గురిపెట్టింది. ఇటీవలే మూడో వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేయడం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ముంబై సర్కిల్స్లో సంచలనంగా మారింది.
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జూ బిష్ణోయ్, అలాగే టైసన్ బిష్ణోయ్ పేర్లతో సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్డమ్ ముసుగులో ఆమిర్ ఖాన్ దేశంలో ‘లవ్ జిహాద్’ను ఎంకరేజ్ చేస్తున్నారని, ఈ చర్యలను తాము ఎంతమాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆ పోస్ట్లో తీవ్రంగా హెచ్చరించారు. సనాతన ధర్మానికి, దేశభక్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని తమదైన రీతిలో శిక్షిస్తామని, ఆమిర్ ఖాన్కు త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని.. ఇది తమ తొలి, ఆఖరి హెచ్చరిక అని గ్యాంగ్స్టర్లు స్పష్టం చేశారు. ఫేస్బుక్ పోస్ట్, ఒక వాయిస్ నోట్ ద్వారా ఈ బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి.
ఈ బెదిరింపు సందేశంలో కేవలం ఆమిర్ ఖాన్ ప్రస్తావన మాత్రమే కాకుండా, రాజస్థాన్లోని శ్రీ గంగనగర్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక దారుణమైన నేరాన్ని కూడా గ్యాంగ్ ఉదహరించింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో స్థానిక అధికార యంత్రాంగం తీసుకున్న వేగవంతమైన చర్యలను ప్రశంసించిన ముఠా.. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కొందరు రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చట్టం కళ్లుగప్పి తిరుగుతున్న నిందితులతో పాటు, వారికి అండగా నిలుస్తున్న వారికి తామే స్వయంగా శిక్ష విధిస్తామని పేర్కొంది. అలాగే, తమ గ్యాంగ్కు చెందిన పర్వేష్, హిమాన్షు అనే అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వమని, శత్రువులకు గట్టి బుద్ధి చెబుతామని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బెదిరింపు పోస్ట్, వాయిస్ నోట్పై ముంబై పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. సైబర్ క్రైమ్ బృందాలు ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాయిస్ నోట్ వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులపై ఆమిర్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి పోలీసులకు ఇంతవరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఆమిర్ ఖాన్ తరఫు నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందితే, వెంటనే కేసు నమోదు చేసి, ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు ఆమిర్ ఖాన్కు కూడా అండర్వరల్డ్ బెదిరింపులు రావడం బిటౌన్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














