హైదరాబాద్ నుంచి ‘మిస్టికల్ కాశ్మీర్’ ఫ్లైట్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ టూరిజం ప్రకటించింది. ఆరు రోజులు, ఐదు రాత్రుల పాటు జరిగే ఈ ఎయిర్ టూర్లో జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్‌లను సందర్శించే అవకాశం ఉంటుంది. ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ అందించిన వివరాల ప్రకారం ఈ ప్యాకేజీ కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2026 అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో బయలుదేరుతుంది. ప్యాకేజీలో రౌండ్-ట్రిప్ విమాన టికెట్లు, హోటల్ బస, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సైట్‌సీయింగ్, లోకల్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అక్టోబర్ 12, నవంబర్ 21 తేదీల్లో రెండు విడతల ప్రయాణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)














