EPIC Movie: ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

‘బేబీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుని, కుర్రాళ్ల హృదయాలను గెలుచుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.

News18
News18

‘బేబీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుని, కుర్రాళ్ల హృదయాలను గెలుచుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాలో ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం అన్నీ సమపాళ్లలో ఉండేలా కథను రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బేబీ’ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని రూపొందించిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న ప్రవిడుదల కానుంది. రిలీజ్‌కు ముందు సాంగ్స్, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలతో సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ రిలీజ్ తేదీ మరో కారణంతో కూడా చర్చనీయాంశంగా మారింది. మొదట విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కోసం అనుకున్న తేదీకే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తన కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రణబాలి’ షూటింగ్ కొనసాగుతుండటంతో ఆ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అదే డేట్‌ను ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కోసం ఫిక్స్ చేశారు. అన్నయ్య సినిమా కోసం అనుకున్న తేదీలో ఇప్పుడు తమ్ముడు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ’90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో మెప్పించిన శివాజీ, వాసుకి ఆనంద్ ఈ చిత్రంలో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథలో వీరి పాత్రలు భావోద్వేగాలకు బలాన్ని చేకూర్చనున్నట్లు సమాచారం. కాలేజ్ జీవితం, యువత ఆలోచనలు, ప్రేమలోని మధుర క్షణాలు, కుటుంబ విలువలు వంటి అంశాలను దర్శకుడు తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే ఈ సినిమాపై యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు హెషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు వచ్చిన ఆదరణతో ఆల్బమ్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ‘బేబీ’తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జోడీ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా? దర్శకుడు ఆదిత్య హాసన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా? అనే ప్రశ్నలకు సమాధానం సెప్టెంబర్ 11న థియేటర్లలో దొరకనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports