మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ‘ఇరుముడి కట్టు’ పాట ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ కూతురి పాత్రలో కనిపించిన ఓ చిన్నారి తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిన్నారి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగింది.













