Last Updated:
మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ఇరుముడి. తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’. నిన్ను కోరి, మజిలీ, ఖుషీ వంటి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ, తొలిసారిగా రవితేజ లాంటి మాస్ హీరోతో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కమర్షియల్ హంగులకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నభా నటేష్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకున్న నభా.. ఈ స్పెషల్ సాంగ్‌లో తన గ్లామర్‌తో అలరించనుందని టాక్. అయితే, నభా నటేష్ కేవలం ఐటెం సాంగ్‌కే పరిమితం కాకుండా, ఈ సినిమాలో ఓ కీలకమైన అతిథి పాత్రలో (గెస్ట్ రోల్) కూడా కనిపించనుందట. కథలో భాగంగా వచ్చే రవితేజ – నభా నటేష్ కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమా కథ పట్ల రవితేజ అత్యంత విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన కథే ఈ ‘ఇరుముడి’. ఈ ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కొత్త ప్రయాణంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని తన మనసులోని మాటను పంచుకున్నారు. రవితేజ మార్క్ ఎనర్జీకి, శివ నిర్వాణ మార్క్ సెంటిమెంట్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ (Mythri Movie Makers) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నకాస్త్ర.. రవితేజకు కూతురిగా ఓ ఎమోషనల్ పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే నభా నటేష్ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













