Jana Nayakudu Movie: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ.. విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉంది? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన లాస్ట్ సినిమాగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్న ‘జన నాయకుడు’ సినిమా జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

News18
News18

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన లాస్ట్ సినిమాగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్న ‘జన నాయకుడు’ సినిమా జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు కీలక పాత్రలో నటించింది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ విలన్‌లుగా నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా, తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ కథను ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…

కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన విజ్జి అలియాస్ మమితా బైజును దళపతి వెట్రి కొండన్ అలియాస్ విజయ్ దళపతి ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమెను ఆర్మీ అధికారిగా చూడాలని కలలు కంటాడు. కానీ విజ్జి భయాలతో పాటు మానసిక సమస్యల కారణంగా ఆ దిశగా వెళ్లడానికి ఆసక్తి చూపదు. ఇదే సమయంలో జాన్ హిమ్లర్ అలియాస్ బాబీ డియోల్ అనే ప్రమాదకర వ్యక్తి, రాజకీయ నాయకుడు రోజా రంగసామి అలియాస్ ప్రకాష్ రాజ్‌తో కలిసి దేశంలో మత ఘర్షణలు రేపి అల్లకల్లోలం సృష్టించే కుట్ర పన్నుతాడు. ఈ కుట్రను దళపతి ఎలా అడ్డుకున్నాడు? విజ్జిలోని భయాన్ని ఎలా పోగొట్టాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.

నటన పరంగా విజయ్ మరోసారి తన స్టార్‌డమ్‌ను చాటుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లు, స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటాయి. మమితా బైజుతో ఆయన మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు బాగా పండాయి. అయితే పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి అనుభవజ్ఞులైన నటులకు కూడా బలమైన పాత్రలు రాలేదు. నాజర్, ప్రియమణి, రేవతి, గౌతమ్ మీనన్ వంటి నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలు గుర్తుండిపోయేలా లేవు.

దర్శకుడు హెచ్. వినోత్ భగవంత్ కేసరి కథను భారీ యాక్షన్ నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ కథలో చేసిన మార్పులు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ముఖ్యంగా రాజకీయ అంశాలను కథలో బలవంతంగా జోడించడం వల్ల సినిమా అసలు భావోద్వేగం తగ్గిపోయింది. విలన్ ట్రాక్ కూడా కొత్తదనం లేకుండా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. మూడు గంటలకు పైగా నిడివి ఉండటంతో సినిమా కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది.

సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నిరాశపరుస్తాయి. అనిరుధ్ సంగీతం నుంచి అభిమానులు ఆశించిన స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినిపించదు. కొన్ని పాటలు మాత్రమే గుర్తుండిపోతాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించినా ఆ గ్రాండియర్ తెరపై పూర్తిగా కనిపించలేదనే భావన కలుగుతుంది.

మొత్తంగా చూస్తే ‘జన నాయకుడు’ విజయ్ అభిమానులకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్ల కారణంగా నచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కొత్త అనుభూతిని ఇవ్వదు. బలమైన కథనం, కొత్తదనం ఆశించే వారికి ఇది నిరాశ కలిగించే అవకాశముంది. విజయ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రేటింగ్: 2.75

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed