ఈ ప్రకృతి విపత్తు కారణంగా జపాన్ దక్షిణ ప్రాంతంలో లెక్కలేనన్ని భవనాలు కుప్పకూలాయి, ప్రధాన రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయనీ, రోడ్లు పగుళ్లు ఇవ్వడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విధ్వంసం కారణంగా స్థానిక రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే జపాన్లో గ్యాస్ సిలిండర్లను ఇళ్ల బయట.. గొలుసులతో బంధించి ఉంచుతారు. తద్వారా గ్యాస్ లీకైనా, అగ్ని ప్రమాదం జరిగినా.. ఇళ్ల బయటే జరిగేలా చేస్తున్నారు. (Image: AFP)














