Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..! | ACTPnews

Jeevan Reddy Protest | రైతులతో కలిసి హైవేపై జీవన్ రెడ్డి ధర్నా..!



మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బుధవారం (మే 6, 2026) ఉద్రిక్తత నెలకొంది. అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రెడ్డితో కలిసి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ధాన్యం కొనుగోలులో జాప్యం చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports