Kamal Haasan: ‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీంను అభినందించారు కమల్ హాసన్.

News18
News18

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఆల్రెడీ వంద కోట్ల క్లబ్బులో చేరిన ‘మండాడి’ వరల్డ్ వైడ్‌గా ఇంకా దూసుకుపోతోంది.

‘మండాడి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఇప్పటికే రజినీకాంత్ టీంకి అభినందనలు తెలియజేశారు. ఇక తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ‘మండాడి’ టీంని అభినందించారు. ప్రత్యేకంగా టీంని కలిసి ప్రతీ ఒక్కరితో మాట్లాడి ‘మండాడి’ గురించి గొప్పగా ప్రశంసించారు. దర్శక, నిర్మాతలో పాటుగా సూరి, సుహాస్, రవీంద్ర విజయ్ అందరినీ కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి, అందరితో మాట్లాడి, బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.

‘నా జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా ‘మండాడి’ టీం మీద డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మాకు ఈ అవకాశం కల్పించిన మహేంద్రన్ అన్నకి, డిస్నీ బ్రదర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘మండాడి’ చిత్రానికి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన బలాలుగా మారాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాయి. ఈ సినిమాలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports