Karnataka Politics: రాహుల్‌తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews

News18


Last Updated:

ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

News18
News18

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

సిద్ధరామయ్య రాజీనామాను ఇప్పటికే కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో మరో కీలక నేత డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో సిద్ధరామయ్య తన రాజకీయ భవిష్యత్తుతో పాటు కుటుంబానికి సంబంధించిన కొన్ని అంశాలపై కూడా చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్యకు కీలక బాధ్యతలు ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. యతీంద్రను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి పరిచయం చేసినట్లు కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈ సమావేశాన్ని “సానుకూల చర్చ”గా అభివర్ణించారు. అయితే సమావేశంలో ఏ అంశాలు చర్చించారన్న విషయాన్ని వెల్లడించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మరియు పార్టీ మధ్య సమతుల్యత సాధించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీకే శివకుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు సిద్ధరామయ్య మాత్రం తాను కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షుడుమల్లికార్జున ఖర్గే కూడా సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసించారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించినప్పటికీ, తన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని ఖర్గే అభినందించారు.

ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికతో పాటు పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మారతాయన్నదానిపై రాజకీయ విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed