Sonu Sood: సేవే లక్ష్యంగా.c. వనపర్తిలో సోను సూద్ చేతుల మీదుగా అంబులెన్స్ ప్రారంభం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రియల్ హీరో సోనుసూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించారు.

News18
News18

రియల్ హీరో సోనుసూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. హైదరాబాదులోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను బహూకరించారు. ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూ సూద్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. అంబులెన్స్ స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదే అని పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోను సూద్ అంబులెన్స్ ను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలను అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం అని ఫౌండర్ కొండ కృష్ణమ్మకు అభినందనలు తెలిపారు. అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని కుటుంబాలకు అండగా నిలవాలని ఆటో కార్మికులకు హితువు చెప్పారు. ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలంటూ మాల్యవి కరణోదయ సొసైటీ వారిని కోరారు.

మాల్యవి కరణోదయ సొసైటీని 2004 ఫౌండర్ కొండా కృష్ణమ్మ హైదరాబాదులో స్థాపించారు. 22 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ గాంధీ ఆసుపత్రి నీలోఫర్ ఆసుపత్రి తదితర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారు. చాలామంది నిరుపేదల కళా సహకారమయ్యేలా వారి ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ సప్లై చేశారు. కరోనా సమయంలో కూడా సొసైటీ సేవలను ఆపకుండా మరింత విస్తృతంగా చేశారు. మహిళలకు ఉపాధి కోసం కుట్టుమిషన్లను కూడా బహుకరించారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేస్తూ సమాజం మీద తమ ప్రేమను, బాధ్యతను కొనసాగించాలని ఆశిస్తున్నారు.

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చిన రియల్ హీరో సోనూ సూదుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పేదవారికి అండగా ఉంటూ అందరి ఆశీర్వాదంతో సొసైటీని ఇలాగే అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed