బుల్లితెరపై ‘ముద్ద మందారం’, ‘కళ్యాణ వైభోగం’ వంటి సీరియల్స్‌తో పాటు, 2022లో ప్రసారమైన ‘త్రినయని’ సీరియల్‌తో నటిగా తనకంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకుంది గాయత్రీ సింహాద్రి. ఇప్పుడు కార్తీకదీపం 2 లో మెయిన్ విలన్‌గా ఛాన్స్ కొట్టేసి తన టాలెంట్ నిరూపించుకుంటోంది. ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న విలన్లలో గాయత్రి ఒకరు. వార్తల ప్రకారం, ‘కార్తీక దీపం 2’ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు (సగటున 35 వేలకు పైగా) భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం.













