Kavitha New Party: కవిత కొత్త పార్టీ పేరు ఇదే.. అరే భలేగుందే..! | | ACTPnews

Kavitha New Party


Last Updated:

Kavitha New Party:అమరవీరుల ఆశయ సాధన కోసం- సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరును ప్రకటిస్తారు. అయితే కవిత నూతన రాజకీయ పార్టీ పేరు ప్రకటించడానికి ముందే పేరు బయటకు వచ్చేసింది.

Kavitha New Party
Kavitha New Party

Kavitha New Party: తెలంగాణ అంటేనే అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణగా ఆవిర్భవించిన ఈ దక్షిణాది రాష్ట్రంలో జాతీయ పార్టీలను తలదన్నే విధంగా స్థానిక పార్టీలు ఇక్కడ రాజ్యమేలుతూ వస్తున్నాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే బలమైన పార్టీగా ఉంది. ఇక రాష్ట్ర సాధన కోసం ఉద్యమపార్టీగా ఏర్పడిన నాటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్ట్రాంగ్‌గా పునాదులు వేసుకొని ప్రత్యేక రాష్ట్రంలో రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజకీయ పరిణామాలు, ప్రజల ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం కారణంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ ఓటమి తర్వాత బలమైన ఉద్యమ పార్టీలో భేదాభిప్రాయాలు, చీలికలు, ఆధిపత్యధోరణి, వలసలు, విమర్శలు అన్నీ ఆపార్టీని కాస్త కుంగదీశాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఛీఫ్ కేసీఆర్ తనయురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి పార్టీతో తెగదెంపులు చేసుకొని సొంతగా కొత్త రాజకీయ బాటను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు తగినట్లుగా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. ప్రత్యేకమైన గుర్తుతో అధికారం చేపట్టబోతున్నామనే ధీమాలో ఉన్నారు. ఇందుకు కొనసాగింపుగానే ఏప్రిల్ 25న హైదరాబాద్ మేడ్చల్‌లోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్-6 దగ్గర రాజకీయ పార్టీ ఆవిర్భావసభకు సర్వం సిద్దం చేస్తున్నారు.

కవితక్క పార్టీ పేరు ఇదేనట..

అమరవీరుల ఆశయ సాధన కోసం- సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరును ప్రకటిస్తారు. అయితే కవిత నూతన రాజకీయ పార్టీ పేరు ప్రకటించడానికి ముందే పేరు బయటకు వచ్చేసింది. తెలంగాణ ప్రజాజాగృతి పార్టీగా నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే పేరును ఈనెల 25న జరిగే ఆవిర్భావసభలో ప్రకటిస్తారని తెలంగాణ జాగృతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు ఓ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతోందని ఇప్పటికే ప్రకటించారు కవిత.పార్టీ పేరు ఏది పెట్టాలనే అంశంపై అనేక పేర్లను పరిశీలించినప్పటికి ఇప్పటికే ప్రజల్లో రిజిస్టర్ అయిన తెలంగాణ జాగృతికి ప్రజలను కలుపుతూ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఫిక్సైనట్లుగా తెలుస్తోంది.

అనేక పేర్లు పరిశీలన తర్వాత ఫిక్స్..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలతో పాటు స్థానిక బలమైన బీఆర్ఎస్ పార్టీని కాదని కొత్తగా పెడుతున్న కవిత తెలంగాణ ప్రజాజాగృతి పార్టీ ఏ మేరకు ప్రజల అభిమానాన్ని చురగొంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరో రెండున్నర ఏళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా ఎవరూ సరైన అంచనా వేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి వేరు కుంపటి పెట్టుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. బీఆర్ఎస్‌లో అసంతృప్తులు, పదవులు దక్కని వారు, పార్టీలో సరైన గౌరవం లభించని వాళ్లంతా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజాజాగృతి పార్టీ పంచన చేరుతారనే సంకేతాన్ని స్వయంగా కల్పకుంట్ల కవితే ఇచ్చారు. మరి ఈ పార్టీ విధివిధానాలు, అజెండా ఎలా ఉంటుంది..? ఏవిధంగా ముందుకు వెళ్తుందనే విషయాలు బహిర్గతం కావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports