Komatireddy : టాపర్ భవితకు కోమటిరెడ్డి అండ! | ACTPnews

Komatireddy : టాపర్ భవితకు కోమటిరెడ్డి అండ!



పదో తరగతిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచిన విద్యార్థిని భవితకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అండగా నిలిచారు. పాత స్కూల్ ఫీజు కట్టలేక, సర్టిఫికెట్లు చేతికి రాక భవిత పడుతున్న ఇబ్బందుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంత్రి తక్షణమే స్పందించారు. భవిత చదివిన స్కూల్ ప్రిన్సిపల్ను స్వయంగా తన క్వార్టర్స్కు పిలిపించి, పెండింగ్లో ఉన్న రూ. 60 వేల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. అంతేకాకుండా, పాలిసెట్ (POLYCET) వెరిఫికేషన్కు అదే చివరి రోజు కావడంతో అధికారులతో మాట్లాడి వెంటనే సర్టిఫికెట్లు ఇప్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports