రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. సోమవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం, మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సభా సంఘం (House Committee) వేయాలని తాము డిమాండ్ చేస్తే, పాత కేసులపై సీఐడీ విచారణ వేసి పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని గవర్నర్ను అభ్యర్థించారు.
Source link
KTR : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










