Late Dinners Effects: రాత్రి 9 తర్వాత భోజనం చేస్తున్నారా? మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ విషయాలు! | లైఫ్ స్టైల్ | ACTPnews

Late Dinners Effects: రాత్రి 9 తర్వాత భోజనం చేస్తున్నారా? మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ విషయాలు!


Last Updated:

మనలో 90 శాతం మంది చేసే తప్పు ఇదే.. ఐవా రిపోర్ట్‌లో కళ్లు చెదిరే నిజాలు!

Late Dinners Effects: రాత్రి 9 తర్వాత భోజనం చేస్తున్నారా? మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ విషయాలు!
Late Dinners Effects: రాత్రి 9 తర్వాత భోజనం చేస్తున్నారా? మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ విషయాలు!

ఉరుకులు పరుగుల జీవితం.. ఏసీ గదుల్లో గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు.. రాత్రి పొద్దుపోయాక భారీ భోజనాలు.. అర్ధరాత్రి దాకా స్మార్ట్‌ఫోన్లతో జాగారాలు.. ఇదీ నేటి పట్టణ భారతంలో కనిపిస్తున్న సగటు జీవనచిత్రం. ఈ ఆధునిక జీవనశైలి భారతీయుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రపంచంలోనే తొలి టచ్-ఆధారిత మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ సంస్థ ‘ఐవా’ (EYVA) తాజాగా విడుదల చేసిన ‘ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026’ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో పేలవమైన జీవక్రియ (మెటబాలిక్) ఆరోగ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఈ అధ్యయనం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షల రీడింగ్స్ ఆధారంగా ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం అనేది మన దేశంలో ఇప్పుడు ఒక జాతీయ అలవాటుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 54 శాతం మంది రాత్రి 9 గంటల తర్వాతే కడుపునిండా తింటున్నట్లు నివేదికలో తేలింది. సుదీర్ఘ ప్రయాణాల కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటుండటంతో, వారి కోసం మిగిలిన కుటుంబ సభ్యులు కూడా భోజన సమయాలను మార్చుకుంటున్నారు. దీనికి తోడు నిద్రపోయే ఆరు గంటల ముందు కెఫిన్ తీసుకోవడం, తిన్న తర్వాత ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాలతో నిద్ర నాణ్యత దెబ్బతింటోంది. ఒకే రకమైన ఆహారం తీసుకున్నా సరే, వ్యక్తుల శరీర తత్వాలను బట్టి మరుసటి రోజు ఉదయం వారి గ్లూకోజ్ స్థాయిల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్లు నిర్వాహకులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Renigunta Railway Station: రేణిగుంట స్టేషన్‌లో గంటపాటు నరాలు తెగే ఉత్కంఠ.. రైలు పైకెక్కిన వ్యక్తి, చివరకు..

ఆలస్యంగా, అధిక మోతాదులో, ఉప్పగా ఉండే వేపుళ్లు తినడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తపోటు పెరిగే ముప్పు పొంచి ఉందని తేలింది. ఒత్తిడి, రాత్రి వేళ భారీ భోజనాలు, నిద్రకు ముందు కెఫిన్ తీసుకోవడం లాంటివి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతున్నాయి. భోజనం చేసిన తర్వాత జీవక్రియ చురుకుగా ఉన్నప్పుడే నిద్రపోవడం వల్ల శరీరం సరిగ్గా కోలుకోలేకపోతోంది. ఇలాంటి సంచిత జీవనశైలి లోపాలను ‘మెటబాలిక్ హ్యాంగోవర్’గా పిలుస్తామని ఐవా వ్యవస్థాపకుడు, సీఈఓ సునీల్ మదికట్ల వివరించారు. మరోవైపు, భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం లాంటి చిన్నపాటి శారీరక శ్రమ చేసిన 37 శాతం మందిలో గ్లూకోజ్ స్థాయిలు 12 నుంచి 16 శాతం వరకు తగ్గుముఖం పట్టి, నిద్ర కూడా మెరుగైనట్లు వెల్లడైంది.

ఇది కూడా చదవండి: PM Kisan News: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. రూ.20 వేలు మిస్ అవ్వొద్దు, వెంటనే ఇలా చేయండి!

వివిధ నగరాల వారీగా చూస్తే ఆరోగ్య ధోరణుల్లో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో శీతాకాలంలో వాయు కాలుష్యం (AQI) పెరిగినప్పుడు అక్కడి వారిలో జీవక్రియ స్కోర్లు 6 నుంచి 9 శాతం మేర పడిపోయాయి. ముంబైలో 52 శాతం మంది లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్నా సరే, రద్దీ కారణంగా వారిలో ఒత్తిడి పెరిగి హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. బెంగళూరులో కదలకుండా చేసే ప్రయాణాల వల్ల ఉద్యోగుల రోజువారీ కదలికలు 18 శాతం మేర తగ్గిపోయాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో ఏకంగా 64 శాతం మంది ఉద్యోగులు రాత్రి 10 గంటల తర్వాతే భోజనం చేస్తున్నారని, ఫలితంగా మరుసటి రోజు ఉదయం వారి మెటబాలిక్ స్కోర్‌లు తక్కువగా ఉంటున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది.

ఈ అధ్యయనం హెచ్చరికలతో పాటే ఒక సానుకూలమైన పరిష్కారాన్ని కూడా చూపించింది. రోజువారీ అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఆరోగ్య స్కోర్లు గణనీయంగా పెరుగుతాయని నిరూపించింది. రాత్రి వేళ భోజనం త్వరగా ముగించడం, తిన్న తర్వాత కాసేపు నడవటం, సాయంత్రం వేళల్లో కెఫిన్ తగ్గించడం లాంటి మంచి అలవాట్లను ఆచరించిన వినియోగదారుల్లో కేవలం మూడు నెలల వ్యవధిలోనే వెల్నెస్ స్కోర్లు 8 నుంచి 12 శాతం మేర పెరిగాయి. ఏ ట్రాకర్లు లేదా పరికరాల వల్ల ఈ స్కోర్లు పెరగవని, కేవలం మన దైనందిన జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఈ నివేదిక నేటి సమాజానికి స్పష్టమైన సందేశం ఇస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports