Ee Paata Korinavaaru Movie Review: ‘ఈ పాట కోరినవారు..’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Ee Paata Korinavaaru Movie Review: 'ఈ పాట కోరినవారు..' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు


పల్లెటూళ్ళలో ప్రజలకు వినోదం అంటే సినిమాలు, పాటలే. ఇప్పుడు జెన్ జి యువత ‘ఎఫ్‌ఎమ్’లలో సాంగ్స్ వింటున్నారు. కాలంలో 30 యేళ్ళు వెనక్కి వెళితే రేడియోలో సాంగ్స్ వినేవారు. రేడియోలో వచ్చే సాంగ్ బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా… అనేది ఉపశీర్షిక. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ సినిమాల ఫేమ్ చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించారు. సెప్టెంబర్ 18న విడుదలైంది.

కథ:

సాగర్ (హర్ష) గెస్టు హౌసులో ఉంటాడు. అతడి అన్నయ్య (రవి వర్మ) అమెరికాలో ఉంటాడు. తమ్ముడిని చూసుకోవడానికి ఇద్దరు పనోళ్ళను పెడతాడు. ప్రతి రోజూ రాత్రి పదిన్నరకు రేడియోలో ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అని ఓ ప్రయివేటు ఆల్బంలో సాంగ్స్ ప్లే చేస్తారు. నెమలిపాలెం ఎక్కడ ఉంది? ఆ సాంగ్ ప్లే చేయమని కోరుతున్నది ఎవరు? తెలుసుకోవాలని సాగర్ బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో జరిగిన పరిచయాలు, ఫ్లాష్‌ బ్యాక్, ఊహించని ట్విస్టులు మిగతా సినిమాను, కథను ముందుకు నడిపిస్తాయి.

విశ్లేషణ:

రేడియోలో వచ్చే పాటను కేవలం మిస్టరీకి కాకుండా, దాని వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ – అక్కడ ప్రేమను లింక్ చేయడం బావుంది. కథను మిస్టరీకి మాత్రమే పరిమితం చేయలేదు. లవ్ స్టోరీ, సాంగ్స్ వంటివి యాడ్ చేశారు. వీలు చిక్కిన చోటు ఫన్ జనరేట్ చేశారు. దాంతో సస్పెన్స్ చక్కగా బిల్డ్ అయ్యింది. అలాగే కామెడీ కూడా కుదిరింది. ఫస్ట్ హాఫ్‌లో తొలుత హీరో క్యారెక్టర్, అతని దగ్గర పనిచేసే ఇద్దరిని పరిచయం చేసిన దర్శకుడు… కాసేపు రొమాంటిక్ పంచ్ డైలాగులతో నవ్వించారు. హీరోకి దగ్గర అయినట్టు పని అమ్మాయి నటిస్తే, అది చూసి అతడిని ప్రేమించే అబ్బాయి జలసీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రేడియోలో పాట కోరినవారు ఎవరు? అనే సస్పెన్స్ మైంటైన్ చేస్తూ నడిపారు. అక్కడక్కడా బోరింగ్ సీన్స్ కనిపించాయి. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ కొంత రొటీన్ అయినా మ్యూజిక్ ఆ ఫీల్ రాకుండా కవర్ చేసింది. ఫ్లడ్ సీన్స్ బాగా తీసి ఉంటే బావుండేది. మరింత ఆసక్తి పెరిగేది. సెకండాఫ్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.

నటీనటుల పనితీరు:

సాగర్ క్యారెక్టర్‌కు హర్ష డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు. ఓవర్ డ్రామా చేయకుండా జనరల్ పబ్లిక్ టైపులో నేచురల్‌గా చేశాడు. సస్పెన్స్, ఎమోషనల్ సీన్స్ ఓకే. జలసీ ఫీలయ్యే సీన్లలో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. అమైరా గోస్వామి బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. సుజనా రెడ్డి గ్లామర్ పరంగా మార్క్స్ స్కోర్ చేసింది. హీరో బ్రదర్ రోల్ చేసిన రవి వర్మ తన పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు. రేఖా నిరోషా సినిమా ప్రారంభ సన్నివేశాల్లో నవ్వించారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు పర్వాలేదు.

సాంకేతిక విభాగం:

మదన్ రాసిన కథలో మిస్టరీ, లవ్, రొమాంటిక్ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాకు కథ ప్రధాన బలం. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టు కాకుండా నేచురాలిటీకి దగ్గరగా చంద్ర సిద్ధార్థ్ సినిమా చేశారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇదొక ఎక్స్‌పరిమెంట్. దర్శకుడిగా కథకు న్యాయం చేశారు. పులగం చిన్నారాయణ డైలాగుల్లో కొన్ని పంచ్‌లు నవ్వించాయి. జే రేక్స్ మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ పరంగా ఫ్లడ్ సీన్స్ బాగా చేయాల్సింది.

మంచి పాయింట్‌తో తెరకెక్కిన మ్యూజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. మిస్టరీ, మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ఓటీటీలో అయితే ఈ తరహా సినిమాలకు ఆదరణ బావుంటుంది.

రేటింగ్: 2.75



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports