Lawrence Political Entry: పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ సంచలన ప్రకటన.. ఇదెక్కడి ట్విస్టురా బాబూ.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తన పొలిటికల్ ఎంట్రీ పై రాఘవ లారెన్స్ వీడియో రిలీజ్ చేశారు. అలా అయితేనే రాజకీయాల్లోకి వస్తా అంటూ ఓ కండీషన్ పెట్టారు. ఆ వివరాలు చూద్దామా..

News18
News18

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రముఖులు రావడం కొత్తేమీ కాకపోయినా, తాజాగా ఒక అగ్ర నటుడు, దర్శకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన రాజకీయ అరంగేట్రంపై అధికారికంగా స్పష్టతనిచ్చారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటిస్తూ, ఇందుకోసం ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో లారెన్స్ తన మనసులోని మాటను పంచుకున్నారు. “నేను ఫలితం ఆశించకుండా నిజాయతీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. నా జీవితంలో రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాకు ఎలాంటి పదవులు, సీట్లు కావాలని లేదు, అలాగే రాజకీయం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన అంతకంటే లేదు. నాకు అత్యంత సన్నిహితులెవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారి పక్కన నిలబడి సమాజానికి ఇప్పుడు చేస్తున్న దానికంటే మరింత ఎక్కువ సేవ చేయాలని అనుకున్నాను. కానీ, ఇటీవల జరిగిన కొన్ని ఊహించని పరిస్థితులు, సంఘటనలు నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయి” అని ఆయన వివరించారు.

రాజకీయాల్లోకి వెళ్తాననే తన నిర్ణయానికి తన తల్లి కూడా అంగీకారం తెలిపారని లారెన్స్ పేర్కొన్నారు. అయితే, ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు ప్రజల అభిప్రాయమే సర్వోన్నతమని ఆయన స్పష్టం చేశారు. “నా నిర్ణయం సరైందో కాదో మీరే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా ప్రజలు, అభిమానులు ‘అవును’ (Yes) అని అంగీకరిస్తే.. మీ ఆశీస్సులతో రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తాను. ఒకవేళ మీరు ‘వద్దు’ (No) అని చెబితే, ఈ ఆలోచనను ఇక్కడితోనే విరమించుకుంటాను. ఎప్పటిలాగే నా ట్రస్ట్ ద్వారా సమాజం కోసం నిస్వార్థంగా సేవలను కొనసాగిస్తాను” అని లారెన్స్ ప్రకటించారు.

తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల నుంచే పోటీ?

తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. లారెన్స్ తిరుచ్చి ఈస్ట్ (Trichy East) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ (Vijay) పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు స్థానాల నుంచి పోటీ చేసి భారీ విజయాలు సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. విజయ్‌తో లారెన్స్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం, స్నేహం కారణంగా ఆయన టీవీకే (TVK) పార్టీలో చేరి, అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports