Last Updated:
సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు.
సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా మౌళిని మార్కెట్లో మాములుగా దింపలేదు. ఈ సినిమా హిట్టు తర్వాత మౌళికి ఆఫర్లు గుమ్మం దగ్గరికే వచ్చేస్తున్నాయి. అయితే మౌళి మాత్రం వచ్చింది కదా అని ఒకే చెప్పకుండా.. టైమ్ తీసుకుని మంచి కంటెంట్‌తో రావాలని ప్లాన్ చేసుకున్నాడు..
అనుకున్నట్లుగానే తాజాగా తన సెకండ్ మూవీని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టారు. చాలా మంది రోజు వాడే ఊత పదాల్లో ఇది ఒకటి. కొన్ని సార్లు కామెడీగా, కొన్ని సార్లు సీరియస్‌గా తిట్టే ఈ పేరును.. ఏకంగా సినిమా టైటిల్‌గానే పెట్టుకున్నాడంటే ఈ సారి కంటెంట్ మాములు ఎంటర్టైనింగ్గా ఉండదు అనే క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వరుస విజయాలతో భారీ సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మౌళి సినిమాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త కథలు, కొత్త టాలెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాకు శ్రీను కంబాల కథను అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. పూర్తి స్థాయి క్రైమ్ కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. క్రైమ్ అంశాలను వినోదంతో మేళవిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించినట్టు సమాచారం. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
మౌళి సరసన సుస్మితా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ జంట తెరపై కొత్తగా కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంగీత బాధ్యతలను సింజిత్ యెర్రమిల్లి చేపట్టగా, సినిమాటోగ్రఫీని సూర్య బాలాజీ అందిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమాను ఉన్నత స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














