Lodge Bathroom Death: లాడ్జీ బాత్రూంలో 23 ఏళ్ల యువతి డెడ్ బాడీ.. రాత్రికి రాత్రే పరారైన ఇద్దరు యువకులు | ట్రెండింగ్ | ACTPnews

Lodge Bathroom Death


Last Updated:

Lodge Bathroom Death: పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ యువతి లాడ్జీలోని బాత్‌రూంలో శవమై కనిపించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బెంగుళూరు సమీపంలో ఈఘటన చోటుచేసుకుంది. లాడ్జీ బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న యువతి పేరు వర్ష అని ఆమె స్వస్థలం చిక్కబనవరగా పోలీసులు గుర్తించారు.

Lodge Bathroom Death
Lodge Bathroom Death

Lodge Bathroom Death: పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ యువతి లాడ్జీలోని బాత్‌రూంలో శవమై కనిపించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బెంగుళూరు సమీపంలో ఈఘటన చోటుచేసుకుంది. లాడ్జీ బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న యువతి పేరు వర్ష అని ఆమె స్వస్థలం చిక్కబనవరగా పోలీసులు గుర్తించారు. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని వలలహళ్లి కుడిగెలోని ఒక లాడ్జ్‌లో ఇద్దరు యువకులతో కలిసి వచ్చి వర్ష రూమ్ తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అయితే లాడ్జీలోని బాత్రూంలో ఆమె శవం లభ్యమవడం, వర్ష వెంట వచ్చిన ఇద్దరు యువకులు పారిపోవడంతో మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ లాడ్జిలో ఏం జరిగింది..? 23 ఏళ్ల ఆ యువతి చావుకి కారణం ఏంటీ..? పారిపోయిన ఆ ఇద్దరు యువకులు ఎవరూ..? అనే మిస్టరీని చేధించడానికి పోలీసులు లాడ్జీలోని సీసీ ఫుటేజ్‌తో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు.

లాడ్జి బాత్రూంలో లేడీ డెడ్ బాడీ..

బెంగళూరులోని చిక్కబనవరకు చెందిన వర్ష అనే యువతి మృతిపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. హాసన్ జిల్లాలోని సకలేష్‌పూర్ తాలూకాలోని వలలహళ్లి కుడిగేలో ఒక లాడ్జ్‌లో 23 ఏళ్ల యువతి మరణించిన కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. వర్ష బాత్రూంలో ఎలా చనిపోయింది..? ఆమె వెంట వచ్చిన ఇద్దరు యువకులకు ఏమైంది..? ఇలాంటి ప్రశ్నలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఆ ఇద్దరూ ఎవరూ..?

వర్ష ఇద్దరు యువకులతో కలిసి హాసన్‌లోని సకలేష్‌పూర్‌కు వెళ్లినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది.మృతురాలితో పాటు ఇద్దరు యువకులు మొత్తం ముగ్గురు ముగ్గురూ శ్రీదేవు లాడ్జ్‌లో ఒక గదిని బుక్ చేసుకున్నారు. మరుసటిరోజు తెల్లవారుజామున ఆ యువతి బాత్రూంలో శవమై కనిపించింది. ఆ ఇద్దరు యువకులు అదృశ్యమయ్యారు. గత శుక్రవారం ఆ యువతి ఇద్దరు యువకులతో కలిసి లాడ్జికి వచ్చినట్లుగా సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఆ యువకులు ఆ యువతిని ఏమైనా చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు. డివైఎస్పి మాలతేష్ లాడ్జికి వెళ్లి సమాచారం సేకరించారు. లాడ్జీలోని సీసీ ఫుటేజ్ సేకరించారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సకలేష్‌పూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed