Tirumala: తిరుమలలో కొత్త అనుభూతి.. భక్తుల కోసం పైలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం..! Tirumala Pilgrims Experience Center. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు పైలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది భక్తులకు శ్రీవారి ఆలయ విశిష్టతను 3D, VR సాంకేతికతతో పరిచయం చేస్తుంది.

+

News18

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వద్ద ఏర్పాటు చేసిన పైలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి సీఎం కేంద్రాన్ని సందర్శించారు. భక్తులకు తిరుమల ఆలయ విశిష్టత, శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలను ఆధునిక సాంకేతికతతో పరిచయం చేయడమే ఈ కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది.

ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో భక్తులు శ్రీవారికి నిర్వహించే వివిధ నిత్య సేవలు, పూజా కార్యక్రమాలు, తిరుమల ఆలయ ప్రాశస్త్యాన్ని దృశ్యరూపంలో తెలుసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా త్రీడీ వీడియో ప్రదర్శనల ద్వారా శ్రీవారి ఆలయానికి సంబంధించిన విశేషాలను భక్తులకు చూపించనున్నారు. దీంతో తిరుమల చరిత్ర, ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఆసక్తికరంగా తెలుసుకునే అవకాశం భక్తులకు లభించనుంది.

ఇక ఈ కేంద్రంలో ఆధునిక సాంకేతికతకు కూడా పెద్దపీట వేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలోని వివిధ ప్రదర్శనలను పరిశీలించడంతో పాటు వర్చువల్ రియాలిటీ సాంకేతికత ద్వారా తిరుమల దర్శన అనుభూతిని తిలకించారు. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో AI, VR వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నట్లు ముందుగా టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, కైంకర్యాలు, తిరుమల ప్రత్యేకతలను భక్తులు కేవలం వినడం మాత్రమే కాకుండా దృశ్యరూపంలో అనుభవించే అవకాశం ఉంటుంది. దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని కూడా భక్తులకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడేలా మార్చాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తోంది. ఇదే పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు తదితర కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

మొత్తంగా తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ విశిష్టతను మరింత చేరువ చేసేందుకు ఈ పైలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా త్రీడీ విజువల్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతలతో తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని కొత్త తరహాలో పరిచయం చేయడం ఈ కేంద్రం ప్రత్యేకతగా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed