PM Modi: ఓజీ, ఫ్లెక్స్, ఫోమో.. 76వ ఏట జెన్ జీ భాషతో దూసుకెళ్తున్న ప్రధాని మోదీ! | | ACTPnews

News18


Last Updated:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త డిజిటల్ అవతారంలో మెరుస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సరికొత్త జెన్ జెడ్ పదజాలంతో ఆయన చేస్తున్న ప్రసంగాలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

News18
News18

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రజా జీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆయన, ప్రజలతో మమేకమయ్యే విధానాన్ని నిరంతరం సరికొత్తగా మార్చుకుంటూనే ఉన్నారు. సరిగ్గా ఇదే వ్యూహంతో నేటి తరం యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన సరికొత్త పంథాను ఎంచుకున్నారు. గతంలో వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ వేదికల ద్వారా రాజకీయ ప్రచారం సాగించిన ప్రధాని, ఇప్పుడు నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. యువత నిత్యం వాడే ‘ఓజీ’ (OG), ‘ఫ్లెక్స్’ (Flex), ‘ఫోమో’ (FOMO) వంటి పదాలను అలవోకగా వాడుతూ జెన్ జెడ్ (Gen Z) తరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్నారు. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న 35 ఏళ్లలోపు యువతను చేరుకోవడమే లక్ష్యంగా ఆయన తన డిజిటల్ శైలిని పూర్తిగా మార్చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ వైపు ఎందుకు మొగ్గు చూపారు?

2026 జులై నెలలో పరీక్షా పత్రాల లీకేజీ సమస్యపై యువత దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన సమయంలో ప్రధాని మోదీ అర్థరాత్రి సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. సాధారణ అధికారిక ప్రసంగాలకు భిన్నంగా, సహజమైన శైలిలో మాట్లాడిన ఆ నిమిషాల వీడియోకు ఏకంగా 30.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 10 లక్షల మందికి పైగా కొత్త ఫాలోవర్లు చేరారు. అనంతరం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన వివరాలను సైతం స్వయంగా రీల్స్ ద్వారా యువతకు వివరించారు.

మోదీ డిక్షనరీలో జెన్ జెడ్ పదాలు!

సెప్టెంబర్ 5న ఢిల్లీ యూనివర్సిటీ ఎస్ఆర్‌సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మోదీ, విద్యార్థుల భాషలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కళాశాల పూర్వ విద్యార్థులను ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్’ (OGs) అని కొనియాడారు. ‘ఎస్ఆర్‌సీసీలో చదువుకున్నానని చెప్పుకోవడమే ఒక గొప్ప ఫ్లెక్స్ (గర్వకారణం)’ అంటూ నవ్వులు పూయించారు. గతంలో డెన్మార్క్ సదస్సులో పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఫోమో’ (మిస్ అవుతామనే భయం) అనే పదాన్ని ప్రయోగించారు.

Word What It Means Where Modi Used It
FOMO “Fear of missing out” — the anxiety of missing something others are enjoying India-Denmark Business Forum, Copenhagen, 2022 — urging investors not to miss India’s growth story
OG “Original Gangster” — someone exceptional, authentic or old-school SRCC centenary address, Sept 5, 2026 — calling the college’s alumni “the OGs”
Flex To show off or proudly display an achievement or status SRCC centenary address, Sept 5, 2026 — “saying you are from SRCC is a flex in itself”
Dhurandhar A stalwart or master of one’s craft; also the title of a 2026 Bollywood hit SRCC centenary address, Sept 5, 2026 — “Dhurandhar na ho lekin dhoom machai hai”

పార్లమెంట్‌లోనూ మారిన నేతల భాష ప్రధాని స్ఫూర్తితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంపీలు సైతం సరికొత్త యువ పదాలను వాడటం విశేషం. పేపర్ లీకేజీ బిల్లు చర్చలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ‘క్లాక్ ఇట్’ అని మోదీ పరిష్కారాన్ని ప్రశంసించగా, ఎంపీ తేజస్వి సూర్య విద్యార్థుల ఆలోచనలను విపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయంటూ ‘డెలూలు’ (భ్రమ) అని వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా కూడా రీల్స్‌లో వైరల్ అవుతున్న పదాలను సభలో ప్రస్తావించారు.

Leader Party Gen Z Word Used What It Means Context
Bansuri Swaraj BJP Clock it To notice or correctly identify something Said “Modi ji clocked it” while crediting PM Modi for spotting and fixing the paper-leak policy gap
Tejasvi Surya BJP Delulu; “fix the source code” “Delusional”; a coding metaphor for systemic reform Called the Opposition “delulu” for believing protesting youth backed them; said India needs to “fix the source code” of its exam system
Shrikant Shinde Shiv Sena MIA, FOMO, Delulu “Missing in action”; “fear of missing out”; “delusional” Used all three together to describe the Opposition’s shifting response to the July 20 protest march
Deepender Singh Hooda Congress Kuchu Puchu; Wasteguna Huiya Viral, largely nonsensical Gen Z catchphrases popularised on Instagram Reels and at the protests Cited protest placards and slogans using both phrases to press the government on the seriousness of the issue
Supriya Sule NCP (SP) Delulu “Delusional” Told BJP MPs not to be “delulu” in assuming youth support, while urging the House to return to serious debate

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తన డిజిటల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ, నేటి యువతరానికి చేరువ కావడంలో మోదీ ముందంజలో నిలుస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed