Last Updated:
టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న మంచు మనోజ్.. నేడు తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
టాలీవుడ్ హీరోగా మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు మంచు మనోజ్. ఈ హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన.. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో మంచు మనోజ్ వివరించారు. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే అన్నారు మంచు మనోజ్.
అదేవిధంగా ‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు. మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్’ చిత్రం ఉంటుంది. అందులో నేను డీసీపీగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అంతలోపు ‘ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను అని మనోజ్ చెప్పారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అని మీడియా అడగ్గా.. ఆసక్తికరంగా సమాధానమిచ్చారు మంచు మనోజ్. మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు అని చెబుతూ ఓపెన్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రాజకీయ ఆరంగేట్రం, పొలిటికల్ జర్నీ గురించిన డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













