Mandadi Movie: 'మండాడి' టీజర్ రిలీజ్.. వేరే లెవల్‌లో ఉంది మామ..! | ACTPnews

Mandadi Movie: 'మండాడి' టీజర్ రిలీజ్.. వేరే లెవల్‌లో ఉంది మామ..!



తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మండాడి’. టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. బోట్ రేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్నీ మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ అనే డైలాగ్స్, టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *