Mirzapur The Movie: ‘మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ రిలీజ్.. ఉత్కంఠభరితంగా వీడియో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. తాజాగా ‘మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ రిలీజ్ చేశారు.

News18
News18

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ “మిర్జాపూర్ : ది మూవీ” టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. 2018 లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమా ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్‌గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవి కిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు. పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డూ భయ్యా), దివ్యేందు (మున్నా భయ్యా) తమ ఐకానిక్ పాత్రల్లో మరోసారి అదరగొట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ టీజర్ చూశాక ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి అభిషేక్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మిర్జాపూర్: ది మూవీ’ హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కానుండటం విశేషం. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటర్లలో భారీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports