Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్ కైవసం! | | ACTPnews

PC: X.com


Last Updated:

Miss World 2026: ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ ‘మిస్ వరల్డ్ 2026’ గ్రాండ్ ఫినాలే వియత్నాంలో ఘనంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహైరీ మోలా (Joheirry Mola) విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

PC: X.com
PC: X.com

ప్రస్తుత మిస్ వరల్డ్, థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచాత చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) నూతన విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో స్పెయిన్ సుందరి ఎలిసబెత్ రేన్స్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఫైనల్లో విశ్వసుందరి కిరీటం కోసం జోహైరీ మోలాతో పాటు ఎలిసబెత్ రేన్స్ (స్పెయిన్), తానుసియా చెట్టి (మలేషియా), స్నిత్ హబ్తేబ్ (ఎరిట్రియా), లే న్గుయెన్ బావో న్గోక్ (వియత్నాం), రొమాండా హోంబిర్ (దక్షిణాఫ్రికా) పోటీ పడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *