Last Updated:
తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని సోనోవిజన్ మొబైల్ షాపులో భారీ చోరీ కలకలం రేపింది. సుమారు రూ.2 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీకి గురైనట్లు ప్రాథమిక సమాచారం.
తిరుపతి అన్నమయ్య సర్కిల్లో భారీ మొబైల్ షాపు చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్లోని సోనోవిజన్ మొబైల్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. షాపులోకి ప్రవేశించిన దుండగులు భారీగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.













