Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

Mojtaba Khamenei: తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రజల ప్రధాన డిమాండ్ అని దీనిని తాము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతిజ్ఞ చేశారు.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

శనివారం తన తండ్రి అంత్యక్రియల ముగింపు సందర్భంగా తన అధికారిక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఆయన ఒక లిఖితపూర్వక సందేశాన్ని విడుదల చేశారు. “మా అమరవీరుడైన నాయకుడి (అలీ ఖమేనీ) పవిత్ర రక్తాన్ని, అలాగే ఈ రెండు యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులందరి రక్తాన్ని కళ్లచూసిన ఆ నేరగాళ్లను, అవమానకరమైన హంతకులను మేము వదిలిపెట్టం. వారి నుంచి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ప్రతీకారం మా జాతీయ సంకల్పం” అని మొజ్తబా పేర్కొన్నారు.

ఈ హత్యలకు కారణమైన శత్రువుల జాబితా తమ వద్ద ఉందని, ఆ నేరస్థులు మంచంపై ప్రశాంతంగా ప్రాణాలు వదలాలనే కోరికను తమతో పాటే సమాధి చేసుకుంటారని ఆయన హెచ్చరించారు. “ఈ ప్రతీకార చర్య అనేది నా ఉనికిపై కానీ, లేదా ఇతర ప్రభుత్వ అధికారుల ఉనికిపై కానీ ఆధారపడి లేదు. మేము ఉన్నా లేకపోయినా ఈ ప్రతీకారం జరిగి తీరుతుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వేచ్ఛా ప్రియులైన ప్రజలంతా ఈ దైవిక మిషన్‌లో భాగస్వాములు అవుతారు” అని స్పష్టం చేశారు.

అంత్యక్రియలకు భారీ స్పందన

గత ఆరు రోజులుగా జరిగిన అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకలకు మిలియన్ల సంఖ్యలో తరలివచ్చిన ప్రజల భాగస్వామ్యాన్ని ఆయన ‘శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే చారిత్రాత్మక ఘట్టం’గా అభివర్ణించారు. ఆయా దేశాల ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణించిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు ఈ అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ముగిసింది.

మరోవైపు, ఇరాన్ నుంచి తనకు పొంచి ఉన్న ముప్పుపై అమెరికా మాధ్యమాలు ప్రస్తావించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. తనను గనుక ఇరాన్ హతమార్చడానికి ప్రయత్నించి విజయవంతమైతే, ఆ దేశం మునుపెన్నడూ చూడని స్థాయిలో ఇరాన్‌ను పూర్తిగా బాంబులతో నామరూపాలు లేకుండా చేయాలని తాను ఇప్పటికే యూఎస్ మిలిటరీకి ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాన్ని కూడా ఈ కథనంలో గుర్తుచేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports