Last Updated:
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది.
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
‘పూజా మేరీ జాన్’ సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఇన్నాళ్లూ విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా విడుదలకు సంబంధించి అనేక మార్పులు, ఆలస్యాలు చోటుచేసుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
తాజా సమాచారం ప్రకారం ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చినట్లైంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుండటంతో డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా స్వీకరిస్తారనే ఆసక్తి కూడా నెలకొంది.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథ, కథనంతో పాటు పాత్రల చుట్టూ తిరిగే మిస్టరీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించే విధంగా స్క్రీన్‌ప్లేను రూపొందించినట్లు సమాచారం. సినిమా కథలో వచ్చే మలుపులు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ గతంలో పేర్కొన్నారు.
ఈ సినిమాకు నవజ్యోత్ గులాటీ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పూజా మేరీ జాన్’ విషయంలో కూడా సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కథను తెరకెక్కించినట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్‌తో పాటు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ, నటుడు విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు నటుల పాత్రలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ పోషించిన పాత్ర సినిమాలో ప్రధానంగా ఉండటంతో ఆమె నటన ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె.. ఇప్పుడు ‘పూజా మేరీ జాన్’తో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో కనిపించబోతున్నారు. దీంతో ఆమె కెరీర్లో ఈ సినిమా మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో విడుదల కాకపోవడంతో ఎలాంటి బాక్సాఫీస్ ఒత్తిడి లేకుండా నేరుగా డిజిటల్ ప్రేక్షకులను చేరుకోనుంది.
మొత్తానికి చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ‘పూజా మేరీ జాన్’కు ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. మృణాల్ ఠాకూర్, హూమా ఖురేషీ, విజయ్ రాజ్‌ల కాంబినేషన్, నవజ్యోత్ గులాటీ దర్శకత్వం, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.














