Asian Games 2026: ఆసియా క్రీడల్లో ఎలావెనిల్ రికార్డు గురి.. ఒకే రోజు షూటింగ్‌లో భారత్‌కు రెండు రజతాలు! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆసియా క్రీడల్లో భారత స్టార్ షూటర్ ఎలావెనిల్ వలరివాన్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో వ్యక్తిగత రజత పతకం సాధించింది. అంతకుముందు టీమ్ ఈవెంట్‌లోనూ ఆమె రజతం గెలుచుకుంది.

News18
News18

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్టార్ రైఫిల్ షూటర్ ఎలావెనిల్ వలరివాన్ (Elavenil Valarivan) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం సొంతం చేసుకుంది. అంతకుముందు టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం అందించిన ఆమె, కొద్ది గంటల వ్యవధిలోనే వ్యక్తిగత విభాగంలోనూ రజత పతకం ముద్దాడింది. తమిళనాడుకు చెందిన ఎలావెనిల్ ఫైనల్ పోరులో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి స్వర్ణం దిశగా సాగింది. 17వ షాట్ వరకు పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత బాన్ హ్యో జిన్‌పై 1.4 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది.

అయితే ఆఖరి రౌండ్లలో తీవ్ర ఒత్తిడికి లోనై ఏకాగ్రత కోల్పోవడంతో స్వల్ప తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకుంది. మొత్తం 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. జపాన్ షూటర్ హినాటా తైచి 253 పాయింట్లతో ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

వ్యక్తిగత విభాగంలో తొలి పతకం

గతంలో 2018 జకార్తా, 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పాల్గొన్నప్పటికీ ఎలావెనిల్ వ్యక్తిగత పోడియం దక్కించుకోలేకపోయింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఆమె కల నెరవేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య విజేతగా నిలిచిన ఆమె, ఈ పోటీల్లో అగ్రశ్రేణి క్రీడాకారులను వెనక్కి నెట్టి ఆసియా క్రీడల్లో తన తొలి వ్యక్తిగత పతకాన్ని అందుకుంది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ బాన్ హ్యో జిన్ 230.4 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఆఖరి షాట్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎలావెనిల్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత షూటింగ్ బృందానికి ఈ రెండు పతకాలు భారీ ఊపునిచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports