Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు | | ACTPnews

PC: X.com


Last Updated:

బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు.

PC: X.com
PC: X.com

Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకునేందుకు జరిగిన ఒక పెద్ద కుట్రను ముంబై పోలీసులు ముందే పసిగట్టి భగ్నం చేశారు. ఆ తర్వాతే నిందితుడు ఈ నేరాన్ని అంగీకరించాడు. బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్యాప్సూల్స్‌ను నొప్పుల నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్)గా నమ్మించి, భారీ నష్టం కలిగించేలా పంపిణీ చేయడానికి నిందితుడు ప్లాన్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్-I) జయంత్ మీనా తెలిపారు.

ఒక్క క్యాప్సూల్‌తో బయటపడ్డ కుట్ర

“తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో, సల్మాన్ అనే వ్యక్తి ఆ క్యాప్సూల్స్‌లో ఒకదానిని మింగడంతో వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీని ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని, పెద్ద ఎత్తున హాని తలపెట్టడానికే ఈ కుట్ర పన్నినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు” అని డీసీపీ మీనా వివరించారు.

“అతడు 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్‌ను సేకరించాడు. ముంబైలో ఉంటూ గత 15 రోజులుగా వాటిని నింపే పనిలోనే ఉన్నాడు. ఆ క్యాప్సూల్స్‌ను పెయిన్ కిల్లర్స్‌గా నమ్మించి పంపిణీ చేయాలనేది అతని ప్లాన్” అని డీసీపీ జోడించారు.

రంగంలోకి దర్యాప్తు సంస్థలు.. అంతర్జాతీయ లింకులపై విచారణ

సాధారణంగా ఎలుకల మందులో వాడే జింక్ ఫాస్ఫైడ్ నిందితుడు పంపిణీ చేసిన క్యాప్సూల్స్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, డ్యూటీలో ఉన్న అధికారుల సత్వర చర్యల కారణంగా ఒక పెద్ద ఘోరకలి, భారీ ప్రాణనష్టం తప్పిందని ముంబై పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నవి: 14,900 క్యాప్సూల్స్. మిగిలిన క్యాప్సూల్స్, రసాయనాలపై ఇంకా దర్యాప్తు సాగుతోంది.

నిందితుడి నేపథ్యం: నిందితుడు పెయింట్ వ్యాపారం చేస్తున్నాడు. తన వ్యాపార సంబంధాల ద్వారా రసాయనాలను సేకరించగా, ఖాళీ క్యాప్సూల్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు.

విదేశీ సంబంధాలు: “అతని విదేశీ ప్రయాణాల హిస్టరీని, ముంబైలో అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం” అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం డీసీపీ మీనా తెలిపారు. ప్రస్తుతం ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించడానికి, ఇతర నిందితులను గుర్తించడానికి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports