N Ramchander Rao : మేం వచ్చాకే.. ప్రభుత్వం నిద్రలేచింది | ACTPnews

N Ramchander Rao : మేం వచ్చాకే.. ప్రభుత్వం నిద్రలేచింది



వికారాబాద్ జిల్లా కులకచర్లలో నిర్వహించిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గోనె సంచులు, టార్పాలిన్లు, లారీలు లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *