Last Updated:
Naidupeta: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న దంపతులను చాకచక్యంగా ఏమార్చి, వారి వద్ద ఉన్న రూ.3.25 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
కష్టపడి పండించిన ధాన్యం సొమ్ముతో అప్పులు తీర్చుకుందామని భావించిన ఆ పేద రైతు దంపతులకు చివరకు తీరని శోకం మిగిలింది. స్థానిక ఎస్సై శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టమూరు మండలం సవటపెక్లూరు గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణయ్య, ఆయన భార్య రమణమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము వీరి బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆ నగదును విత్‌డ్రా చేసుకుని పాత బాకీలు, వ్యవసాయ అప్పులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాయుడుపేట పట్టణంలోని ఇండియన్ బ్యాంకు శాఖకు చేరుకుని, తమ ఖాతా నుంచి రూ.3.25 లక్షల నగదును డ్రా చేశారు. ఆ సొమ్మును భద్రంగా ఒక బ్యాగులో పెట్టుకుని తమ ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరారు.














