Nepal: వరద విపత్తులో ఆదుకున్న భారత్‌కు నేపాల్ ప్రధాని బాలేన్ షా కృతజ్ఞతలు! | | ACTPnews

News18


Last Updated:

నేపాల్‌లో సంభవించిన పెను వరద విలయం వేళ సకాలంలో స్పందించి సహాయం అందించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని బాలేన్ షా పార్లమెంట్ సాక్షిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో సంబంధాలను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.

News18
News18

నేపాల్‌లో సంభవించిన భయంకర వరద విపత్తు సమయంలో తక్షణమే స్పందించి అండగా నిలిచినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆయన, ప్రకృతి ప్రకోపంతో దేశం అతలాకుతలమైన కష్టకాలంలో భారత్ నిజమైన ఆపద్బాంధవుడిలా ఆదుకుందని కొనియాడారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలు, అత్యవసర ఔషధాలు, ఆహార సామగ్రిని సరిహద్దుల గుండా యుద్ధప్రాతిపదికన పంపి వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports