Nepal Floods: నేపాల్ వరదల్లో గుండెపగిలే విషాదం.. భార్య కిడ్నీ ఆపరేషన్ కోసం దాచిన రూ.25 లక్షలు నీటిపాలు | | ACTPnews

Ai Gen


Last Updated:

నేపాల్ వరదల్లో అత్యంత హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. భార్య కిడ్నీ చికిత్స కోసం భర్త దాచుకున్న రూ. 25 లక్షలు వరదల్లో కొట్టుకుపోయాయి. మరోవైపు ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 700 దాటింది.

Ai Gen
Ai Gen

నేపాల్‌లో సంభవించిన వరద ప్రళయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఒక భర్త పడుతున్న ఆవేదన చూస్తే ఎవరి గుండె అయినా కరిగిపోతుంది. కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న తన భార్య ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ భర్త ఎన్నో ఏళ్లుగా కష్టపడి రూ. 25 లక్షలు కూడబెట్టాడు. భార్యకు తానే స్వయంగా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆపరేషన్ సమయం దగ్గరపడుతున్న వేళ ఆగస్టు 26న వచ్చిన ఆకస్మిక వరదలు వారి జీవితాలను ఆగం చేశాయి. బెత్రావతి ప్రాంతంలో వచ్చిన వరద ఉద్ధృతికి వారి ఇల్లు, సర్వస్వం కొట్టుకుపోయాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *