Last Updated:
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు సహా పలు శాఖల అధికారులు కలిసి భద్రతా లోపాలు, షాపులు, సీసీ కెమెరాలు, అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్., ఆదేశాల మేరకు రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను బలోపేతం చేసేందుకు అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు “ఫుట్‌పాత్ స్టెరిలైజేషన్ ఎక్సర్సైజ్–జాయింట్ టీమ్ ఇన్‌స్పెక్షన్” నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్, బాంబ్ డిస్పోజల్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్, ఎక్సైజ్, ఎలక్ట్రికల్, హెల్త్, ఇంజినీరింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఫుట్‌పాత్ మార్గాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.














