NEET PG 2026: తగ్గిన ప్రశ్నల సంఖ్య.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్.. నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష! రూల్స్ ఇవే | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

NEET PG 2026: దేశవ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘నీట్ పీజీ 2026’ (NEET PG 2026) ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రారంభం కానుంది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మందికి పైగా వైద్య విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. నీట్ పీజీ పరీక్షను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7:00 గంటలకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని ఎన్‌బీఈఎంఎస్ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed