Nepal Floods: నేపాల్ వరదల్లో అద్భుతం.. 24 గంటలు శిథిలాల కిందే.. చివరకు మృత్యువును ఓడించిన 97 ఏళ్ల బామ్మ! | | ACTPnews

PC: PTL/AP


Last Updated:

Nepal Floods: తీవ్ర ప్రాణనష్టాన్ని, విధ్వంసాన్ని మిగిల్చిన నేపాల్ ఆకస్మిక వరద విలయంలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. నలువైపులా మృత్యుఘోష వినిపిస్తున్న వేళ 97 ఏళ్ల ఓ బామ్మ ప్రాణాలతో సురక్షితంగా బయటపడి యావత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది.

PC: PTL/AP
PC: PTL/AP

మట్టి, వరద శిథిలాల కింద సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి గెలిచిన ఆమె దృశ్యాలు నేపాల్ విషాదానికి మానవీయ ముఖచిత్రంగా మారాయి. రసువా జిల్లాలో సంభవించిన వరద ప్రళయానికి గుణమాయ బొహరా (97) ఉంటున్న వృద్ధాశ్రమం పేకమేడలా కూలిపోయింది. భవనం శిథిలాలు, బురద కింద ఆమె చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న నేపాల్ సైన్యం, పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆమెను శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు. సహాయక చర్యల్లో భాగంగా ఆమెను జేసీబీ ముందున్న లోడింగ్ బకెట్ లో కూర్చోబెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed