Normal Delivery: వైద్యులే ఆశ్చర్యపోయే వింత.. సిజేరియన్ లేకుండానే 5.2 కిలోల భారీ బరువున్న బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! heavy baby normal delivery. | | ACTPnews

News18


Last Updated:

రాజస్థాన్ జోధ్ పూర్ రూరల్ కేరు ఆసుపత్రిలో 5.2 కిలోల ఆడబిడ్డ నార్మల్ డెలివరీ ద్వారా జన్మించింది, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండగా ఈ అరుదైన ఘటన వైరల్ అవుతోంది

News18
News18

రాజస్థాన్ లో అరుదైన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జోధ్ పూర్ (Jodhpur) రూరల్ పరిధిలోని కేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కిలోల 200 గ్రాముల బరువున్న ఆడబిడ్డ సాధారణ ప్రసవం ద్వారా జన్మించింది. ఇంత భారీ బరువున్న శిశువు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టడం వైద్య వర్గాల్లోనే కాకుండా స్థానికంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ఘంటియాలి గ్రామానికి చెందిన 32 ఏళ్ల లీలా దేవిని ప్రసవ నొప్పులతో కుటుంబ సభ్యులు కేరు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత సాధారణ ప్రసవం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే శిశువు బరువు అధికంగా ఉండటంతో డెలివరీపై ఉత్కంఠ నెలకొంది. చివరకు వైద్య బృందం సమన్వయంతో సురక్షితంగా ప్రసవం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రసవం అనంతరం 5.2 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ జన్మించిందని వైద్యులు ప్రకటించడంతో ఆసుపత్రిలో ఆనంద వాతావరణం నెలకొంది. సాధారణంగా ఇంత బరువున్న శిశువులు సిజేరియన్ ద్వారా జన్మించడం ఎక్కువగా కనిపిస్తుంటే, ఈ కేసులో మాత్రం నార్మల్ డెలివరీ జరగడం వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది.

ఈ మొత్తం ప్రక్రియను బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ సైనీ పర్యవేక్షించారు. డాక్టర్ కవితా చౌదరి సహా వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి డెలివరీ విజయవంతం చేశారు. ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ దినేష్ చౌదరి మాట్లాడుతూ తల్లి, శిశువు ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సిబ్బంది సమయస్ఫూర్తి, అనుభవం ఈ డెలివరీ విజయానికి ప్రధాన కారణమని చెప్పారు.

ఆడబిడ్డ పుట్టడంతో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇది దేవుడి ఆశీర్వాదం అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. విషయం తెలిసిన గ్రామస్థులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత సవాలుతో కూడిన ప్రసవం విజయవంతం కావడం వైద్య సేవల మెరుగైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. 5 కిలోలకుపైగా బరువున్న బిడ్డ.. అదీ నార్మల్ డెలివరీతో పుట్టడం నిజంగా ఆశ్చర్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాజస్థాన్‌లో జరిగిన ఈ అరుదైన డెలివరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports