Pawan Kalyan: పూజా హెగ్డేకి బంపర్ ఆఫర్.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే, దీని సీక్వెల్ ‘ఓజీ 2’ (OG 2) గురించిన వార్తలు ఫిల్మ్ నగర్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని సమాచారం.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే, దీని సీక్వెల్ ‘ఓజీ 2’ (OG 2) గురించిన వార్తలు ఫిల్మ్ నగర్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుజీత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్స్ లేక, కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయకుండా కాస్త సైలెంట్ అయిన పూజా హెగ్డేకు ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోనే పవన్ సరసన పూజా నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో పవన్-పూజా క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపై చూడాలనుకున్న ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఇప్పుడు ‘ఓజీ 2’ రూపంలో ఆ అవకాశం మళ్లీ ఆమె తలుపు తట్టిందని, మేకర్స్‌తో చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నాయని ఇన్‌సైడ్ టాక్.

ఈ సినిమాను దర్శకుడు సుజీత్ పాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ ఫ్రాంచైజీగా మలచబోతున్నాడు. కేవలం ఒక సీక్వెల్‌గానే కాకుండా ‘ఓజీ యూనివర్స్’ (OG Universe) పేరిట దీనిని విస్తరిస్తున్నారు. ఏకంగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా తన హోమ్ బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై నిర్మిస్తుండటం విశేషం. ఇటీవల విడుదల చేసిన “ఓజీ యూనివర్స్ బిగిన్స్ – ది ఆర్జిన్ ఆఫ్ ఫైర్” అనే కాన్సెప్ట్ వీడియోకు ఫ్యాన్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

కథలో ఊహించని ట్విస్ట్.. నేతాజీతో లింక్?

ఈ సినిమా కథకు సంబంధించి లీకైన కొన్ని వివరాలు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. ఇది కేవలం ఒక రెగ్యులర్ అండర్ వరల్డ్ మాఫియా స్టోరీ కాదని, దీనికి బలమైన చారిత్రక నేపథ్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ (INA) కు సంబంధించిన రహస్య నిధుల చుట్టూ ఈ కథ సాగుతుందట. మాఫియా, రాజకీయాలు, చారిత్రక రహస్యాల మేళవింపుతో సుజీత్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. పవన్ కళ్యాణ్ యాక్షన్, పూజా హెగ్డే గ్లామర్, గూస్‌బంప్స్ తెప్పించే కథతో ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పూజా హెగ్డే ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed