Last Updated:
ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నటి హేమ ఘాటుగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి అభిమానుల మధ్య వాదోపవాదాలకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించగా, ఆయన వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలో నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాజాగా విడుదలైన ఓ వీడియోలో హేమ తనదైన శైలిలో స్పందించారు.
వీడియోలో హేమ మాట్లాడుతూ.. “హలో ప్రకాష్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారెపై మీరు చేసిన ట్వీట్ చూశాను. అందులో పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించారు. మీరు ఏ ఉద్దేశంతో అన్నారో అర్థమైంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే పదాన్ని ఎందుకు వాడతారో మీకు తెలియంది కాదు. రాజకీయంగా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, పాలనను విమర్శించండి తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా హననానికి ప్రయత్నించడం మంచిది కాదు.. ఇలాంటివి గతంలో చాలా మంది చేశారు. అలా చేసిన వారు ఏమైపోయారో చరిత్ర చదువుకోండి అని హేమ అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో రెండు తెలుగు రాష్ట ప్రజలకు తెలుసు అన్నారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై హేమ షూటింగ్ స్పాట్ అనుభవాలను గుర్తు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. “ప్రకాష్ రాజు గారు, మీతో నేను చాలా సినిమాల్లో భార్యగా యాక్ట్ చేశాను. మీ వర్కింగ్ స్టైల్ నాకు బాగా తెలుసు. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకొని సెట్స్‌లో రెడీగా కూర్చుంటాం. ‘ఇంకా వస్తారు, 10 నిమిషాల్లో వస్తారు, గంటలో వస్తారు, లంచ్ తర్వాత వస్తారు’ అంటూ ఎదురుచూసేలా చేస్తారు. తీరా చూస్తే.. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక ‘నేను వేరే కంట్రీ వెళ్ళిపోయాను’ అని చెప్తారు. కనీసం వెళ్ళేముందు ప్రొడ్యూసర్‌కి గానీ, డైరెక్టర్‌కి గానీ ఫోన్ చేసి చెప్పే బాధ్యత కూడా మీకు ఉండదు” అని హేమ విమర్శించారు.
గతంలో తాను కూడా ఈ విషయంపై ప్రకాష్ రాజ్‌ను నిలదీశానని హేమ గుర్తుచేశారు. “సార్, మీ వల్ల మేమందరం సఫర్ అవుతున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నారు? అని నేను అడిగితే.. ‘నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే ఆ కంట్రీకి, ఈ ప్రాంతానికి వెళ్ళిపోయాను’ అని నాతోనే అన్నారు. మరి షూటింగ్లకే మూడ్ లేని మీరు.. రాజకీయాల్లోకి సింగిల్‌గా వస్తారా? గుంపులతో వస్తారా? అసలు మీకు ప్రజాసేవ చేసే మూడ్ ఉందా లేదా? దయచేసి ఒక్కసారి చెప్పండి సార్” అంటూ హేమ తన వీడియో ద్వారా ప్రకాష్ రాజ్‌ను నేరుగా ప్రశ్నించారు.
ప్రస్తుతం హేమ చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో టాలీవుడ్ వర్సెస్ జనసేన పొలిటికల్ వార్ మరింత ముదిరినట్లయింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













