PBKS vs RCB: వెంకటేష్ అయ్యర్ విధ్వంసం.. పంజాబ్‌పై ఆర్సీబీ భారీ స్కోర్ ! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ (58), వెంకటేష్ అయ్యర్ (73) అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

News18
News18

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. కోహ్లీ 37 బంతుల్లో 58 (4 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేయగా, మిడిలార్డర్‌లో వెంకటేష్ అయ్యర్ చెలరేగి ఆడాడు. అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక దేవ్ దత్ పడిక్కల్ 45 (4 ఫోర్లు, 3 సిక్సులు), టిమ్ డేవిడ్ 28 (2 ఫోర్లు, 2 సిక్సులు) సైతం చెలరేగిపోవడంతో ఆర్సీబీ భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో హప్రీత్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports