Last Updated:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). తాజాగా ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు రామ్ చరణ్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది.
ఇందులో భాగంగా మేకర్స్ ఒక వినూత్నమైన ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. రామ్ చరణ్ కార్ డ్రైవ్ చేస్తుండగా, పక్క సీట్లో కూర్చున్న దర్శకుడు బుచ్చిబాబు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఆసక్తికరమైన కార్ రైడ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని కొన్ని కీలకమైన ఎలిమెంట్స్‌ను రామ్ చరణ్ పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు.. ‘‘సార్, ‘పెద్ది’ సినిమాలో మీకు బాగా నచ్చిన, అత్యంత ఇష్టమైన ఎపిసోడ్ ఏది?’’ అని రామ్ చరణ్‌ను ప్రశ్నించారు. దీనికి చరణ్ ఎంతో ఎగ్జైటింగ్‌గా సమాధానమిస్తూ.. ‘‘సినిమా మొత్తంలో నాకు ‘దిల్లీ ఎపిసోడ్’ అంటే చాలా ఇష్టం. ఆ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. ‘పెద్ది’ సినిమా మొత్తంలోనే అత్యధిక మలుపులు (Twists), హై-వోల్టేజ్ డ్రామా ఉండేది ఆ ఢిల్లీ ఎపిసోడ్‌లోనే. నీ మొదటి సినిమా ‘ఉప్పెన’లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ ఎంతలా షాక్ అయ్యారో మనందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాలో వచ్చే ఆ ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్, ‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువగా, మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అని అన్నారు. మెగాస్టార్ వారసుడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలతో మెగా అభిమానుల్లో ఇప్పుడే పూనకాలు తెప్పిస్తున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో, ఒక రౌడీ కబడ్డీ ప్లేయర్‌గా లేదా కోచ్‌గా కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. చరణ్ కెరీర్‌లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 4న రాబోతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి మరి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













