Last Updated:
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, కొన్ని సీన్లు మరీ శృతిమించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అయ్యారు.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, కొన్ని సీన్లు మరీ శృతిమించేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు మండిపడుతున్నారు.
ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ పెదవులు, కళ్లను పొగుడుతుంటే… కెమెరా యాంగిల్స్ మాత్రం ఆమె నడుము, ఎద భాగాలపై ఫోకస్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనికి తోడు, ఒక సీన్లో విలన్ ఒకరు రాజకీయ లబ్ధి కోసం జాన్వీ కపూర్ పాత్రను బహిరంగంగా అవమానించడం, మరికొన్ని సీన్లలో హీరో ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం వంటివి అసభ్యంగా ఉన్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి వల్గర్ సీన్లను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో ప్రతికూల స్పందన వస్తుందని తాను అస్సలు ఊహించలేదని, ఈ విమర్శలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకుల భావోద్వేగాలను తాము గౌరవిస్తామని, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో మహిళా పాత్రలను మరింత హుందాగా, జాగ్రత్తగా డిజైన్ చేస్తానని బుచ్చిబాబు సానా హామీ ఇచ్చారు.
ఈ వివాదాలు ఇలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘పెద్ది’ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
















