థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు రూ. 350 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాలైన నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం రూ. 165 కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కర్ణాటక రూ. 25 కోట్లు, తమిళనాడు రూ. 15 కోట్లు, కేరళ రూ. 7 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 40 కోట్లు పలికాయి. కాగా నార్త్ ఇండియా హక్కులు అత్యధికంగా రూ. 100 కోట్లకు అమ్ముడుపోగా, అక్కడ జియో స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తోంది.













