నిజానికి పెద్దికి ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలు సినిమా గాలి తీసేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశారని, చెర్రీ నటనకు ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. బట్ కథలో డెప్త్, బుచ్చి బాబు నెరేషనే కాస్త దెబ్బేసిందని అంటున్నారు. ఆయన తన ఫోకస్ మొత్తం రామ్ చరణ్ పై పెట్టారు తప్ప కథపై పెట్టలేదని, ఈ కథ అతుకుల బొంతలా ఉందని చాలామంది చెబుతున్నారు. బుచ్చి బాబు ప్రెజెంటేషన్ కి మార్కులు పడటం లేదు.











